Get Instant Access to ap7am Free web app · Opens in one tap Install

లోక్ సభ మళ్ళీ వాయిదా.. పట్టువదలని సీమాంధ్ర ఎంపీలు

సమైక్యాంధ్ర సెగలు పార్లమెంటు ఉభయసభల్లో ఆవిర్లు పుట్టిస్తున్నాయి. లోక్ సభ, రాజ్యసభల్లో సభ్యులు 'జై సమైక్యాంధ్ర' అంటూ అలుపెరుగకుండా నినదిస్తున్నారు. దీంతో, పలుమార్లు గందరగోళం ఏర్పడగా సభ వాయిదా పడుతూ, మళ్ళీ ప్రారంభమవుతూ వచ్చింది. లోక్ సభలో సీమాంధ్ర ఎంపీల ఆగ్రహావేశాలు ఏమాత్రం తగ్గకపోవడంతో స్పీకర్ మీరాకుమార్ మరోమారు సభను వాయిదా వేస్తున్నట్టు ప్రకటించారు. మూడింటికి సభ ప్రారంభమవుతుందని తెలిపారు.

More Telugu News